విజయదశమి దసరా పండుగ Vijayadashami (Dasara Festivals 2024)
పరిచయం, విజయదశమి అంటే అర్థం ఏమిటి అంటే చెడుపై మంచి సాధించిన చిహ్నానికి గుర్తు విజయదశమి అంటారు. ఆరోజునే శక్తి సర్వరూపిణి అయినటువంటి దుర్గ అమ్మవారు విజయాన్ని అందుకున్నారు. కనుక విజయదశమి Vijayadashami Dasara Festivals 2024 అని పేరు వచ్చింది. దీన్నే మరో పేరుతో దసరా పండగ కూడా పిలవబడతారు.
ఈ పండుగను 10 రోజులపాటు చేస్తాము. తొమ్మిది రోజులపాటు అమ్మవారు మహిషాసురుడిపై అనే రాక్షసుడు యుద్ధం చేసి పదవ రోజున ఆ రాక్షసుల్ని సంహరించింది. ఆ వేడుకంగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. హిందువులు ఎంతో సంప్రదాయంగా ఈ పండుగను జరుపుకుంటారు.
దసరా (విజయదశమి) పండుగ హిందూ ధర్మంలో అత్యంత ప్రధానమైన పర్వదినాలలో ఒకటి. దసరా పండుగ 2024 సంవత్సరంలో దసరా పండుగ అక్టోబర్ 13న జరుపుకుంటారు.
ఈ పండుగను 10 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. దీని వేడుక దుర్గాదేవి మహిషాసురుడిపై విజయాన్ని సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే రాముడు రావణుడిపై సాధించిన విజయం కూడా ఈ పండుగకు ఒక ప్రధాన కథనం.
విజయదశమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Vijayadashami Tithi start and end times) 2024
విజయదశమి పండుగ ఎప్పుడు వచ్చిందంటే ముందుగా దశమి తిథి ప్రారంభం ముగింపు సమయాలు తెలుసుకుందాం..!
దశమి తిథి ప్రారంభం 12, అక్టోబర్, 2024, ఆరోజు ఉదయం తెల్లవారుజామున, 05:38 AM నుండి ప్రారంభం అవుతుంది. 13, అక్టోబర్, 2024, ఆదివారం రోజున తెల్లవారుజామున 04:11 AM నిమిషాల వరకు దశమి తిథి ఉంటుంది.
శ్రావణ నక్షత్రం ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Sravana Nakshatra start and end timings) 2024
శ్రావణ నక్షత్రం ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకుందాం..!
శ్రావణ నక్షత్రం ప్రారంభం, 11, అక్టోబర్, 2024, నుండి శుక్రవారం రోజు రాత్రి, 01:26 PM నిమిషాల నుండి 12, అక్టోబర్, 2024, శనివారం రోజున రాత్రి, 12:45 PM నిమిషాల వరకు ఉంటుంది.
నిజానికి ఏ రోజైతే దశమి తిథి శ్రావణ నక్షత్రం కలుస్తుందో ఆ రోజునే దసరా పండగనే జరుపుకుంటాము కావున మనకి ఈ సంవత్సరము దసరా పండగ 12- అక్టోబర్- 2024 ,శనివారం రోజు వచ్చింది.
విజయదశమి పూజ శుభ సమయాలు (Vijayadashami Puja is an auspicious timIngs)
విజయదశమి పూజ శుభ సమయాలు అమ్మగారికి పూజ చేసుకోవడానికి శుభసమయాలు తెలుసుకుందాం..!
శుభ సమయాలు, శనివారం 12- అక్టోబర్ -2024 ఉదయము 07:32 AM ఈ నిమిషాల నుండి ఉదయము, 09:00 AM గంటలలోపు శుభ ఘడియలు ఉన్నాయి. అమ్మవారికి ఈ సమయంలో అమ్మవారి ని పూజించడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి.
ఒకవేళ ఈ సమయంలో పూజ కుదరకపోతే ఉదయం, 10:35 AM నిమిషాల నుండి మధ్యాహ్నం, 01:30 PM నిమిషాలు లోపు పూజను చేసుకోవచ్చు, ఈ విజయదశమి రోజు ఇటువంటి మంచి పనులు చేపట్టిన విజయాలు కలుగుతాయని అని చెప్తారు. అందుకే విజయదశమి రోజున విజయాలను కలగచేసే రోజు గా అంటారు.
ఈరోజు తిధి తోటి వారంతోటి తారా బలము గ్రహబలము దుముహూర్తము యమగండం వర్జము రాహుకాలం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా మనకి ఏ పనులు చేపట్టిన ఆ రోజున మంచి ఫలితాలు చేకూర్తాయని పండితులు తెలియజేస్తారు.
విజయదశమి విజయ ముహూర్తం సమయాలు (Vijayadashami Vijaya Muhurtam Timings)
విజయదశమి విజయ ముహూర్తం సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
విజయ ముహూర్తం సమయం, రోజు శనివారం 12- అక్టోబర్- 2024, మధ్యాహ్నం, 01:50 PM నిమిషాలు నుండి మధ్యాహ్నం, 02:30 PM నిమిషాల వరకు విజయ ముహూర్తం సమయం ఉంటుంది.
విజయదశమి రోజు విజయ ముహూర్తం మీరు విజయం సాధించాలంటే, అనుకునేవారు. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు లో మీకు విజయం సాధించాలి. అనుకునేవారు తప్పకుండా సమయంలో మీరు పూజ అనేది చేసుకోవడం వల్ల అంతా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు,
విజయదశమి ఆయుధ మరియు వాహన పూజ శుభ సమయాలు (Vijayadashami are auspicious timings for weapon and vehicle pooja)
ఆయుధ పూజ శుభ సమయాలు, 12, అక్టోబర్, 2024, శనివారం రోజున ఉదయం, 11:10 AM నిమిషాల నుండి 11:25 AM నిమిషాల వరకు ఆయుధ పూజ చేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం, 12:50 PM నిమిషాల నుండి మధ్యాహ్నం, 01:20 PM నిమిషాల వరకు వాహనాలకి మరియు ఆవిడ పూజ అనేది చేసుకోవచ్చు.
దసరా పండగ రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటంటే వాహనం మరియు ఆయుధ పూజలు చేసుకోవాలి. పనిముట్లకి మరియు వారి వారి వాహనాలకి పూజ అనేది చేయాలి. విజయదశమి రోజున ఈ పని చేసుకోవడం వలన అమ్మవారి ఆశీస్సులు కలిగి, తమ జీవితంలో ఎలాంటి ఘటనలు అనేవి సంభవించకుండా ఉంటాయి.
ఈరోజు కార్యక్రమం ఏమిటి అంటే శమీ పూజను కూడా నిర్వహించుకోవచ్చు, శమీ పూజ అంటే జమ్మి చెట్టుకి పూజ చేయడం. ఎలా చేయడం వలన అపరాజిత దేవి అనుగ్రహం కలుగుతుంది.
శమీ వృక్ష పూజ శుభ సమయాలు
శమీ వృక్ష పూజ శుభ సమయం, 12- అక్టోబర్ -2024 శనివారం రోజున సాయంత్రం, 5:00 pm గంటల నుండి సాయంత్రం, 6:05 pm నిమిషాల వరకు శుభ ఘడియలు అనేవి ఉన్నాయి.
షమీ వృక్ష పూజ అనేది చేసుకోవచ్చు ఒక తెల్లటి కాగితం మీద మనసులో అనుకున్న వంటి కోరికలలో రాసి ఆ జమ్మి చెట్టుకి కట్టడం వలన మనం అనుకుంటా వంటి కోరికలను నెరవేరుతాయి.
దసరా పండుగ శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది. నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి.
- విజయదశమి, పదో రోజు విజయదశమి (దసరా) అని పిలుస్తారు. ఈ రోజు అమ్మవారు మహిషాసురుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
- రామలీలా, ఉత్తర భారతదేశంలో, రామలీలా పేరిట రావణ వధను పురస్కరించుకొని నాటకాలు నిర్వహిస్తారు. చివరి రోజు రావణ, కుంభకర్ణుడు, మేఘనాదుల విగ్రహాలను దహనం చేస్తారు.
- అమ్మవారి అలంకారాలు, దక్షిణ భారతదేశంలో దేవీ నవరాత్రులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రతి రోజు అమ్మవారిని విభిన్న రూపాలలో పూజిస్తారు.
- పూల బంతులు (బతుకమ్మ), తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ సమయంలో బతుకమ్మ పండుగను కూడా జరుపుకుంటారు. ఇందులో మహిళలు పూలతో బంతులు తయారు చేసి పూజలు చేస్తారు.
దసరా పండుగ విశిష్టత, (The specialty of Dasara festival,
- శక్తి పూజ, ఈ పండుగ అమ్మవారికి, శక్తికి సంబంధించినదిగా భావిస్తారు.
- సాంప్రదాయాలు, ప్రతి ప్రాంతంలో వేర్వేరు సంప్రదాయాలు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అమ్మవారి అలంకారాలు, పూజలు విరివిగా ఉంటాయి.
- అయ్యవారి పూజలు, ముఖ్యంగా కృష్ణ, గోదావరి నదీ తీర ప్రాంతాలలో ఆయుధ పూజను నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- నవరాత్రుల ప్రారంభం, అక్టోబర్,03, 2024
- విజయదశమి, అక్టోబర్, 12, 2024
ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో, గుడుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.