Srivari Mettu Footpath Opening Timings 2025 (శ్రీవారి మెట్టు ఫుట్ పాత్ ప్రారంభం సమయాలు

By TempleInsider

Published On:

Srivari Mettu Footpath Opening Timings 2025

Join WhatsApp

Join Now

Srivari Mettu Footpath Opening Timings 2025 Pooja And Darshan Timings Know Its History daily Darshan Timings And Seva Ticket Prices And Cast

Srivari Mettu Footpath Opening Timings 2025 (శ్రీవారి మెట్టు ఫుట్ పాత్ ప్రారంభం సమయాలు)

Srivari Mettu Footpath Opening Timings 2025 లో మార్గానికి మనం ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది.? దారి తిరుపతి నుండి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి, అక్కడ నుండి మూడు కిలోమీటర్ దూరం వెళ్ళాక  శ్రీవారి మెట్లు దగ్గరకు వెళ్లగలము.

శ్రీవారి మెట్లు దగ్గర పోవడానికి ఫ్రీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి.  ఆటోలు కూడా తీసుకోవచ్చు ఆటోకు చార్జి 150 నుంచి 200 దాకా ఉంటుంది. 

అదే బస్సు కి పోతే శ్రీవారి మెట్లు దగ్గరకు 40 ఛార్జి అవుతుంది,  శ్రీవారి మెట్లు దగ్గరకు TTD బస్సులు మరియు ఫ్రీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 20 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది. శ్రీవారి మెట్ల దగ్గరకు రెండు రకాల బస్సులు అయితే ఉన్నాయి.  ఒకటి  TTD ఫ్రీగా  బస్సులు  మరొకటి డబ్బులు బస్సులు కూడా ఉన్నాయి.

శ్రీవారి మెట్లు మార్గానికి బస్సులు టైమింగ్ సమయాలు ఉదయం, 05:30 AM  నుండి సాయంత్రం, 06:00 PM వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

Tirumala Srivari Mettu steps timings (తిరుమల శ్రీవారి మెట్టు వేళలు)

 శ్రీవారి మెట్లు  సమయాలు ఉదయం, 06:05 AM  నుండి సాయంత్రం, 06:05 PM  గంటల వరకు మాత్రమే ఉంటుంది.

12 సంవత్సరాలు పిల్లలకు టికెట్ అవసరం ఉండదు. మరియు వాళ్లకు  శ్రీవారి మెట్లు మార్గం సమయాలు,  మధ్యాహ్నం, 02:00 PM  నుండి సాయంత్రం, 05:00 PM వరకు మాత్రమే పిల్లలకు ప్రవేశం ఉంటుంది.  ఐదు గంటల తర్వాత పిల్లలకు అలిపిరి మరియు శ్రీవారి మెట్లు మార్గం నందు అనుమతించబడదు

శ్రీవారు మెట్లు  మార్గంలో  దుకాణాలు ఉంటాయి,  అక్కడ మనము కొబ్బరికాయ దీపం పసుపు కుంకుమ తీసుకొని మెట్లు మార్గము నందు ప్రయాణం చేయాలి, ఫస్ట్ మెట్టు దగ్గర స్వామివారి చిరునామాలు మరియు శంకు చక్రాలు ఉంటాయి. టెంకాయి పసుపు కుంకుమ దీపం స్వామివారి దగ్గర కొట్టి మనం శ్రీవారి మెట్లు వైపు వెళ్ళాలి,

శ్రీవారి మెట్టు నడక మార్గం మొదలు మొత్తం మెట్లు, 2388 మెట్లు ఉన్నాయి,  స్వామి వారు చేరుకోవడానికి  పైకి 2.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మూడో మెట్టు దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం  మనము అయితే చేసుకొని మెట్లు మార్గము నందు ప్రయాణం చేయాలి, ప్రతి 100 మెట్లకు నెంబర్ అయితే రాసి ఉంటారు. మనం ఎన్ని మెట్లు ఎక్కేమో అనేది కూడా అక్కడ పక్కన బోర్డు ఉంటుంది.

మెట్లు మార్గం వెళ్లేటప్పుడు, మనకు అయితే ఎండ తలక్కోకుండా షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రశాంతంగా మెట్లు మార్గమునందు ప్రయాణం చేసుకోవచ్చు. మెట్లు నడక మార్గంలో  స్వామి వారిని స్మరిస్తూ గోవిందా గోవిందా అనుకుంటూ పోతే ఎలాంటి కష్టాలు లేకుండా వెళ్ళిపోవచ్చు,  40 లేదా 50 మెట్లు మధ్యలో తాగడానికి మంచినీరు ఉంటాయి.

420వ మెట్టు దగ్గర మనకు ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మెట్టు మార్గంలో మొదటి మండపం ఉంటుంది. అతి పురాణతమైనటువంటి మండపం ఇది. మనం తీసుకున్న టికెట్ 1200  మెట్టు దగ్గర స్కానింగ్ చేసుకోవలెను,

Tirumala Srivari Mettu Darshan Timings And Ticket (తిరుమల శ్రీవారి మెట్టు దర్శన సమయాలు మరియు టిక్కెట్)

దర్శనం టికెట్ ఉదయం 6 గంటలకు ఇస్తారు. ఒక రోజుకు 4000 నుండి 5000 వరకు దర్శనం టికెట్ మెట్లు మీద వెళ్లే వాళ్లకైతే ఇస్తారు.

Alipiri mettu Darshan Timings05:20 AM TO 06:00 PM
Srivari Mettu Darshan Timings06:05 AM TO 06:05

దివ్య దర్శనం (SSD) టికెట్లు కొరకు భక్తాదులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకో రావలెను లేదా ID ప్రూఫ్ వంటి తీసుకోరావలెను,

దర్శనం టికెట్ వారం రోజులు ముందే బుకింగ్ చేసుకోవలెను, దర్శనం సమయం 7 నుండి 12 గంటల లోపు దర్శనం మనకు అయితే చేసుకోవచ్చు, ఉచిత టికెట్ దర్శనం ఆన్లైన్లో అందుబాటులో లేవు, దేవాలయం దగ్గరకు వచ్చి ఉచిత దర్శనం టికెట్ తీసుకోవలెను.

దర్శనం టికెట్ వచ్చేసి స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ అంటారు. ఇంతకుముందు దివ్య దర్శనం ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు.

దర్శనం టికెట్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. లేదా దేవాలయాన్ని సందర్శించి టికెట్లు తీసుకోవలెను. ఆలయాన్ని సంప్రదించ నంబరు.

Tirumala Srivari Mettu free luggage facility timings (తిరుమల శ్రీవారి మెట్టు ఉచిత లగేజీ సౌకర్యం సమయాలు)

దర్శనానికి వచ్చిన భక్తాదులకు ఉచిత లాగే సెంటర్లో అందుబాటులో ఉన్నాయి, శ్రీవారి  మొదటి మెట్టు దగ్గర  దేవస్థానానికి వచ్చిన భక్తాదులకు టీటీడీ దేవస్థానం ఫ్రీ లాగేజ్ కౌంటర్ అందుబాటులో పెట్టి ఉంది.

భక్తాదులకు వారితో తీసుకువచ్చిన బ్యాగులు మరియు లగేజ్ ఇతర వస్తువులను ఫ్రీగా స్టోర్ చేసుకోవడానికి మనకి దేవస్థానం ఫ్రీ కౌంటర్ ఇచ్చినది,  

మెట్లు మార్గం నందు పైకి పోయేదశలో మనకు చివరి మెట్టు దగ్గర  ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం పోయేలోపు మన వస్తువులు అక్కడికి వస్తూ ఉంటాయి.. పైకి వెళ్లిన వెంటనే మన బ్యాగు మరియు లగేజ్ వంటి తీసుకొని వెళ్ళిపోవాలి.

Srivari Mettu walking timings for quick darshan (శీఘ్ర దర్శనం కోసం శ్రీవారి మెట్టు నడక సమయాలు)

శ్రీవారి మెట్టు పాదయాత్ర మార్గంనందు మీరు దర్శనం సమయాలు, 2  నుండి 3  గంటలు సమయాలతో పడుతాయి. శ్రీవారి మెట్లు మార్గం పోయిన భక్తుడు  భక్త శ్రద్ధలతో గోవిందా గోవిందా స్మరుస్తూ మెట్లు మార్గం నందు ప్రయాణం చేస్తారు,  

మెట్లు మార్గం దర్శనం సమయాలు ఉదయం, 06:00 AM  నుండి సాయంకాలం, 05:00 PM  వరకు ఉంటాయి. ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి పౌర్ణమి రోజున 24 గంటలు దర్శనాలైతే ఉంటాయి.

 భక్తాదులకు టీటీడీ దేవస్థానం ఉచిత వసతి గృహాలు అందుబాటులో పెట్టింది. శ్రీకృష్ణదేవరాయ సదన్ యాత్ర కు వసతి భవనము ఉచితంగా ఇవ్వబడును.

Parking place at Srivari steps (శ్రీవారి మెట్ల వద్ద పార్కింగ్ స్థలం)

శ్రీ వారి మెట్లు వద్ద పార్కింగ్   స్థలము ఉంది. భక్తాదులు జీపు మరియు బైకు వాహనాలకు టీటీడీ దేవస్థానం ఫ్రీ గా పార్కింగ్ స్థలాలు ఉన్నాయి,  

మీరు టూ వీలర్ బైకు మరియు  ఇతర వాహనాలకు ఉచితంగా పార్కింగ్ ప్లేస్ మీ దేవస్థానం భక్తాదులకు ఉచిత పార్కింగ్ స్థలాలు ఇవ్వబడును. పార్కింగ్ స్థలం సమయాలు ఉదయం, 05:00 AM  నుండి రాత్రి, 10:00 PM వరకు ఉంటుంది.

Best Time To Visit Srivari Mettu (శ్రీవారి మెట్టు సందర్శించేందుకు ఉత్తమ సమయం)

శ్రీవారి మెట్టు దర్శనం చేసుకోవడానికి ఉత్తమ సమయం ఎప్పుడు వస్తుందో అంటే,  మార్చు మరియు   జూన్ మరియు జూలై నెలలో ఉత్తమ సమయమని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో  భక్తులకు  స్వామివారి దర్శనానికి ఉత్తమ సమయం చెప్పుకోవచ్చు. వేసవి కాలంలో ఎవరి దర్శనం చేసుకోవచ్చు భక్తాలలో శ్రీవారి మెట్లు మార్గమునందు వేసవికాలంలో అందమైన కొండల మధ్య చెట్లు పచ్చదనం మధ్యలో మెట్లు మార్గం ప్రయాణం భక్తాదులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలగజేస్తుంది.

 

Leave a Comment