Srisailam Mallikarjuna Swamy TempleSrisailam Mallikarjuna Swamy Temple

Srisailam Mallikarjuna Swamy Temple Pooja And Darshan Timings, Darshan Tickets Online And History Full Information In Telugu,

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం (Srisailam Mallikarjuna Swamy Temple)

పరిచయం, శ్రీశైలం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని  నంద్యాల మండలంలో శ్రీశైలం అనే గ్రామంలో శ్రీశైలం పర్వతంపై  Srisailam Mallikarjuna Swamy Temple కొలువై ఉంది . ఇది ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం మరియు 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయంలో భ్రమరాంబికా దేవి కూడి ఉండటంతో శ్రీశైలక్షేత్రం శక్తిపీఠం కూడా అవుతుంది.  

నంద్యాల నుండి శ్రీశైలం కి  159 కిలోమీటర్ల దూరంలో ఉంది.  కర్నూల్ నుండి శ్రీశైలం కి 179 కిలోమీటర్ దూరంలో ఉంది. విజయవాడ నుండి  శ్రీశైలం కి 268 దూరంలో ఉంది.  హైదరాబాదు నుండి శ్రీశైలం కి 230 కిలోమీటర్ దూరంలో ఉంది.  మార్కాపూర్ నుండి  శ్రీశైల దేవస్థానానికి 57 కిలోమీటర్ దూరంలో ఉంది.

శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా దేవి ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలు. పురాణాల ప్రకారం, ఈ స్థలానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది, ఇది శైవ, శక్త సంప్రదాయాలకు అనుసంధానమైనది. పంచపార్వతరాజు కైలాసం తర్వాత ఈ స్థలం శివపార్వతులకు ఎంతో ప్రియమైనది. నల్లమల అరణ్యంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సుందరతను కూడా చాటిస్తుంది.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం  భక్తాదురు ప్రతినిత్యం సందర్శించడానికి వస్తూ ఉంటారు.  మల్లికార్జున స్వామి భక్తులు  ప్రతినిత్యం  ఆలయానికి  ఆధ్యాత్మిక  అనుభవంతో  ఆలయంలో దర్శనం చేసుకుంటారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం టికెట్ ధరలు (Srisailam Mallikarjuna Swamy Darshan ticket prices)

శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం టికెట్, మరియు ఆన్లైన్ టికెట్, దర్శనం టికెట్,  టుమారో టికెట్, టుడే టికెట్,

దర్శనం టికెట్ రకాలు.?

  • శీఘ్ర దర్శనం టికెట్  ధర. 150/-
  • అతి శీఘ్ర దర్శనం టికెట్ ధర.300/-
  • స్పర్శ దర్శనం  టికెట్  ధర, 500/- ( ఒక వ్యక్తికి మాత్రమే)
  • (ఆలయంలో టికెట్ ఇచ్చే సమయాలు రాత్రి, 7:00 pm నిమిషాల నుండి,
  • టికెట్లు లభించే స్థలం,  క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల  అంతర్ద సేవ టికెట్ కౌంటర్లు,
  • దర్శనం సమయం,  ప్రతిరోజు రాత్రి, 9:00 pm నుండి 10:00 pm వరకు దర్శనం చేసుకోవచ్చు.)


శ్రీశైలం మల్లికార్జున స్వామి  ఆలయం దర్శనం  సమయాలు (Srisailam Mallikarjuna Swamy Temple Darshan Timings)

  • మల్లికార్జున స్వామి ఆలయ దర్శనం టికెట్ పిల్లలకు 5 వయసు లోపు  గల పిల్లలకు ఉచితం,
  • డ్రెస్సింగ్ కోడ్,   ఏదైనా కొత్త దుస్తులు మరియు సంప్రదాయ వస్త్రాలు,
  • దర్శనం  సమయాలు, 1:00 నుండి 2:00 వరకు,
  • మాస్క్ లేనిదే ఆలోచన లోపలికి ప్రవేశం ఉండదు,
  • మొబైల్ మరియు కెమెరా అనుమతి లేదు,
  • మల్లికార్జున స్వామి ఆలయ ప్రసాదం  అందుబాటులో ఉన్నాయి.
  • శ్రీశైలం మల్లికార్జున స్వామి  ఆలయంలో దర్శనం సమయం ఉదయం, 5:30 AM నుండి 3:30 PM  వరకు  పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
  • శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం దర్శనం మధ్యాహ్నం, 3:30 PM  నుండి  సాయంత్రం, 6:00 PM  వరకు ఆలయంలో  విరామం సమయాలు ఉంటాయి. 
  • శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సాయంత్రం, 6:00 PM నుండి రాత్రి 10:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ప్రారంభం మరియు ముగింపు  సమయాలు (Srisailam Mallikarjuna Swamy Temple opening and closing timings)

  • శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఉదయం, ప్రారంభం సమయాలు, 5:30 AM   నుండి రాత్రి 10:00 PM  వరకు ఓపెన్ లో ఉంటుంది. తర్వాత  ముగింపు సమయాలు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Srisailam Mallikarjuna Swamy Temple Daily Darshan Timings)

  • సోమవారం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు  మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  
  • మంగళవారం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు   మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  
  • బుధవారం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు   మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  
  • గురువారం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు   మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  
  • శుక్రవారం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు   మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  
  • శనివారం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు   మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  
  • ఆదివారం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉదయం  దర్శనం సమయాలు, 5:30 am  నుండి మరియు   మధ్యాహ్న, 3:30 pm  నుండి మరియు  6:00 pm  నుండి మరియు 10:00 pm వరకు ఉంటుంది.  


శ్రీశైలం మల్లికార్జున స్వామి  ఆలయం సేవ వివరాలు (Srisailam Mallikarjuna Swamy Temple Seva Details)

  • అభిషేకం అలంకార మండపం పూజా రూపాయలు, 1500/-
  • అభిషేకం గర్భాలయం పూజా రూపాయలు, 1500/-
  • అక్షరాభ్యాసం  పూజా రూపాయలు, 500/-
  • అన్న ప్రసన్న పూజా రూపాయిలు, 1000/-
  • చండీ హోమం పూజ రూపాయలు, 1500/-
  • గోవు పూజ  రూపాయలు, 300/-
  • కుంకుమార్చన పూజా రూపాయిలు, 1000/-
  • కుంకుమార్చన  సహకారం మండపం  పూజా రూపాయలు, 500/-
  • లీల కళ్యాణం  పూజా రూపాయలు, 1000/-
  • మృత్యుంజయ హోమం పూజలు రూపాయలు, 1500/-
  • ప్రదోషకాల సేవ పూజా రూపాయిలు, 25116/-
  • రుద్ర హోమం పూజా రూపాయలు, 1500/-
  • సాక్షి గణపతి హోమం పూజా రూపాయిలు, 1116/-
  • సర్ప దోష నివారణ పూజా రూపాయలు, 1500/-
  • శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి వారి  అభిషేకం పూజా రూపాయిలు, 500/-
  • శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి వారి బిల్వర్చన    పూజా రూపాయిలు, 2500/-
  • ఉదయాస్తమాన సేవ  రూపాయలు, 101116/-
  • ఉమా మహేశ్వర స్వామి వ్రతం పూజ రూపాయలు, 5000/-
  • వల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి వారి కళ్యాణం  పూజా రూపాయలు, 1000/-
  • చండీ హోమం  పూజా రూపాయలు, 1116/-
  • ఏకాంత సేవ  పూజా రూపాయిలు, 1116/-
  • గణపతి హోమం పూజ రూపాయలు,1116/-
  • గణపతి పూజ సేవ రూపాయలు, 1116/-
  • కుంకుమార్చన పూజా రూపాయలు, 1116/-
  • లక్ష కుంకుమార్చన పూజలు, 1116/-
  • లీల కల్యాణోత్సవం పూజా రూపాయలు,1116/-
  • మృత్యుంజయ హోమం  పూజా రూపాయిల, 1116/-
  • రుద్రాభిషేకం పూజా రూపాయలు, 1116/-
  • నందీశ్వర స్వామి  విశేష అర్చన పూజా రూపాయలు, 1116/-
  • రుద్ర హోమం పూజ రూపాయలు, 1116/-
  • శ్రీ  భయాలు  వీరభద్ర స్వామి వారు    విశేషార్చన పూజలు, 1116/-
  • వరలక్ష్మి వ్రతం  సేవ పూజ రూపాయలు, 1116/-
  • వల్లి దేవసేన  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం  పూజ రూపాయలు, 1116/-
  • వేదా  ఆశీర్వాదార్చన పూజా రూపాయలు, 1116/-

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం పూజ మరియు  సేవా సమయాలు  (Srisailam Mallikarjuna Swamy Temple Pooja and Seva Timings)

  • శ్రీశైలం దేవాలయం ఓపెనింగ్ సమయాలు ఉదయం తెల్లవారుజామున, 4:00 AM
  • ఆలయం మొదటి గంట, 4:05 AM
  • సుప్రభాతం, 4:30 AM
  • ఆలయం మంగళ వాయిద్యాలు, 5:00 AM
  • మంగళ హారతి, 5:30 AM
  • గోపూజ మరియు ఇతర సేవలు, 6:00 AM
  • స్వామివారి దర్శనం ఉదయం సమయం, 6:30 AM  నుండి 12:00 PM
  • అభిషేకం మరియు  అర్చనాలు, 7:00 AM  నుండి
  • స్వామివారికి అలంకార దర్శనం,  11:00 AM నుండి 3:30 PM
  • స్వామివారి  సాయంత్రం రెండవ గంట, 3:45 PM
  • స్వామివారి అలంకారం మరియు దర్శనం సమయాలు సాయంత్రం, 4:00 PM
  • మహా మంగళహారతి సాయంత్రం,  5:30 PM నుండి 6:10 PM
  • భ్రమరాంబ దేవి పూజలు సమయం సాయంత్రం,  5:00 PM  నుండి 7:00 PM
  • దర్శనం మరియు అర్చన రాత్రి, 6:00 PM నుండి  9:30 PM
  • మల్లికార్జున స్వామి ఏకాంత సేవ సమయం, 9:35 PM  నుండి 9:55 PM
  • శ్రీశైలం,  ఆలయం ముగింపు సమయాలు, 10:00 PM

శ్రీశైలం ఆలయం అన్నదానం సేవ సమయాలు  (Srisailam Temple Annadanam (Food) Seva Timings

శ్రీశైలం  మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉచిత అన్నదాన   శాకాహార పద్ధతిలో నిత్యం భక్తాదాలకు ఉచితం అందజేస్తున్నారు. దేవాలయం అన్నదానం సమయాలు,

  • ఉదయం, 6:00 am నుండి 11:00 AM వరకు
  • మధ్యాహ్నం, 12:00 PM నుండి 5:00 PM  వరకు,
  • సాయంత్రం, 5:30 PM  నుండి   రాత్రి 10:00 PM  వరకు అన్నదానం  అందజేస్తారు.

గమనిక,  శ్రీశైలం  అన్నదాన  సేవా కార్యక్రమంలో వడ్డించే పదార్థాలు , అన్నం, పప్పు,  పాయసం, సాంబారు, అప్పడం, పెరుగు అన్నం, సంపూర్ణ శాఖాహార అన్నదానం శ్రీశైలంలో వడ్డిస్తారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ పండగలు (Srisailam Mallikarjuna Swamy Temple Festivals)

  • మహాశివరాత్రి, 
  • కార్తీక మాసం, 
  • దసరా, 
  • విజయదశమి 
  • దీపావళి, 

వైకుంఠ ఏకాదశి, మొదలైన పండుగలు శ్రీశైలంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. శ్రీశైలం  మల్లికార్జున స్వామి దేవాలయంలో  మహాశివరాత్రి పండగ, చాలా ఘనంగా జరుగుతుంది, అక్కడ ఉన్న దేవతలు శివుడు మరియు పార్వతిలో కారణంగా  ఈ ఆలయం దగ్గర మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతాయి. వేలాది భక్తాదులు  ఈ ఆలయ పండగ చూడడానికి వస్తూ ఉంటారు. అందుకు ఈ ఆలయం ప్రత్యేకత హిందూ సంప్రదాయ పద్ధతులు, ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర (History of Srisailam Mallikarjuna Swamy Temple)

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం.!   పురంలో ఒక కథ  ఉంది అది ఎప్పుడు తెలుసుకుందాం. సిలాదుడు అని  మహర్షికి  మహా శివుడు  కటాక్షం వలన నందికేశ్వరుడు మరియు  పరమతుడు అని ఇద్దరు  పుత్రులు  ఉండేవారు.   

వారిద్దరూ  పరమేశ్వరుడు అనుగ్రహం కోసం దీక్ష చేయడం మొదలుపెట్టారు.   శివుడు వారి తపోస్తుకు వచ్చి  ప్రత్యక్షమయ్యారు.  నందీశ్వరుడు ఒక కోరిక కోరాడు,    ఆ కోరిక ఏమనగా  నిన్ను నేను మోసే భాగ్యాన్ని  ప్రసాదించునే, అడిగాడు.   

పరమశివుడు ఆ కోరికను నేర్చారు. నంది వాహనంగా మారిపోవడం జరిగింది. పార్వతుడు  శివుడు ప్రత్యక్షమై  నీకు ఏమి కావాలి, కోరుకో అనగా అప్పుడు పర్వతడు,  తను ఒక కొండకు మార్చి ఆది దంపతులు  ఇరువురు అందరూ    కొండమీద కొలివితీరి ఉండాలని  కోరిక కోరాడు,  భక్తులకు మెచ్చి    తర్వాత మార్చేశారు.   కొండపైన  ఈశ్వరుడు స్వయంభుఖ వెలిచారని పురాణంలో ఉంది.

శ్రీశైలం, ఆధ్యాత్మికతకు కేంద్రమైన ప్రదేశం, ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర అనేక శతాబ్దాల నాడు ప్రారంభమైంది. ఇది కేవలం ఒక సాధారణ ఆలయం కాదు, ఇది కాలక్రమేణా ఎంతో మంది భక్తుల మనసుల్లో ఆరాధనకు ప్రాధాన్యాన్ని ఏర్పరచిన క్షేత్రం. ఈ చరిత్ర యుగాలుగా విస్తరించబడింది మరియు అనేక రాజవంశాలు, మహారాజులు, మరియు భక్తుల సాక్షిగా ఉన్న గొప్ప పురాణం.

ప్రాచీన రాజవంశాల పూర్వీకుల సేవలు
శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం ఆరాధన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. శాతవాహన వంశం నుండి ప్రారంభమైన ఈ క్షేత్ర ప్రాశస్త్యం, తరువాత ఇక్ష్వాకులు, కదంబులు, చాళుక్యులు మరియు హొయసల రాజులు వరకు విస్తరించింది. ఈ రాజులు తమ భక్తిని మాత్రమే కాక, దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పునాదులను కూడా పెడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించారు. ముఖ్యంగా, శాతవాహనుల కాలం నాటే శ్రీశైలం ఒక పవిత్ర పర్వతంగా ప్రసిద్ధి చెందింది.

చాళుక్యుల గుణాత్మక కృషి
చాళుక్య పాలకుడు పులకేశి నిర్మించిన అనేక దేవాలయాలు, ఆలయ నిర్మాణాలపై అతని ఆరాధన భావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. శివార్చనలో అతనికి కీర్తి ఏర్పడింది. పులకేశి తన భూభాగంలో పలు దేవాలయాలను నిర్మించి, వీటిలో శ్రీశైలంలో మహా శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశాడు.

విజయనగర సామ్రాజ్యం ప్రభావం
విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయలు, ఈ ఆలయానికి మరింత గౌరవం తీసుకొచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారం దేవాలయ గోపురాలను, మండపాలను నిర్మించారు. ఆలయానికి రక్షణ చర్యలుగా గౌరవించబడే గోపురాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి.

చత్రపతి శివాజీ మహారాజు
శివాజీ మహారాజు శ్రీశైలం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేసి, ఉత్తర గోపురం నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన మల్లికార్జున స్వామి భక్తుడిగా ఈ దేవాలయానికి మరింత పౌరవనం తీసుకువచ్చాడు.

ఆధునిక కాలంలో శ్రీశైలం
ప్రాచీన దేవాలయం ఆధునిక కాలంలో కూడా భక్తులచే పూజితమై వస్తోంది. ఈ క్షేత్రం దక్షిణ భారతదేశం నుంచి వచ్చే భక్తులకే కాక, పూర్వం నుంచీ కాశీతో పోల్చబడుతూ మహారాష్ట్ర, ఉత్తర భారతదేశం నుంచి కూడా భక్తులను ఆకర్షిస్తోంది.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు (Architecture and Features of Srisailam Mallikarjuna Swamy Temple)

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉంది. ఇది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా, శైవులకు అత్యంత పవిత్ర క్షేత్రం. ఈ దేవాలయం జ్యోతిర్లింగ క్షేత్రంగా పేరుగాంచింది.

ఆలయ నిర్మాణం

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం ద్రావిడ శిల్పకళా శైలిలో ఉంటుంది. ఈ దేవాలయం గొప్ప ఆర్కిటెక్చర్‌తో నిర్మించబడింది. ఆలయం చాలా  గట్టిగా పునాదితో  కొండపైన నిర్మించారు.

  • ముఖ్య ప్రాకారం, ప్రధాన గోపురం, అద్భుతమైన శిల్పకళా ప్రతిభను ప్రదర్శిస్తుంది. ఇది దక్షిణ భారత శైలిని ప్రతిబింబిస్తుంది.
  • గర్భగృహం, గర్భగృహంలో మల్లికార్జున స్వామి, లింగ రూపంలో విరాజిల్లుతాడు. భ్రమరాంబికాదేవి గర్భగృహం కూడా ఆలయంలో ప్రాముఖ్యత గలది. భ్రమరాంబికాదేవి 18 శక్తిపీఠాలలో ఒకటి.
  • గోపురాలు, ఆలయానికి నాలుగు ప్రధాన గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలు దక్షిణ భారత శైలిలో నిర్మించబడి, అందమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి.
  • శిల్పాలు, ఆలయంలోని ప్రతీ గోడపై శివపార్వతుల వైభవం, శివలీలలు, ఇతర పౌరాణిక సన్నివేశాలు చెక్కబడి ఉంటాయి. వీటి కళాత్మకతను, ప్రతిభను ప్రశంసించక తప్పదు.
  • నందీ మండపం, ఆలయ ప్రవేశంలోనే ఉన్న నందీ మండపం ఒక పెద్ద శిలా విగ్రహంతో ఉంటుంది. నందీ, శివుని వాహనం, ఇది ఈ ఆలయంలో ముఖ్య ఆకర్షణ.
  • అఖండ దీపం,  శ్రీశైలంలో ఒక ప్రత్యేకత, ఆలయంలో వెలిగించే అఖండ దీపం. ఇది ఎప్పటికీ ఆరకుండా ఉండే విధంగా నిర్వహించబడుతుంది.
  • శక్తిపీఠం,  భ్రమరాంబికా దేవి ఆలయం కూడా ఇందులో భాగం కావడం వల్ల, ఇది శివుడు మరియు శక్తి కలయికగా భక్తులకు అత్యంత పవిత్రంగా భావించబడుతుంది.
  • కృష్ణా నది, ఆలయ పక్కనే ప్రవహించే కృష్ణా నది, ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందడానికి ఒక కారణం.

శ్రీశైలం మల్లికార్జున స్వామి  ఆలయ వసతి గృహాలు వివరాలు (Srisailam Mallikarjuna Swamy Temple Accommodation Details)

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు  వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి.మనకు శ్రీశైలంలో రూమ్లో దొరుకుతాయి. తక్కువ ధరపై అయితే దొరుకుతుంది.

  • కొండవీటి సేవ సదనం,
  • వేమారెడ్డి  రెడ్డి సత్రం,
  • బ్రాహ్మణ సత్రాలు,
  • వైష్ణవి సత్రాలు,
  • గణేష్ సత్రం,

  శ్రీశైలంలో  దర్శనానికి వచ్చిన భక్తాదులకు రూమ్లో తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ చేరుకునే మార్గాలు (Approaches to Srisailam Mallikarjuna Swamy Temple

రోడ్డు మార్గం,   శ్రీ శైలం మల్లికార్జున స్వామి దేవాలయం చేరుకోవడానికి  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.

  • హైదరాబాద్ నుండి శ్రీశైలం దూరం సుమారు 229 కిలోమీటర్, 
  • కర్నూలు నుండి శ్రీశైలం 180 కిలోమీటర్,  
  • విజయవాడ నుండి శ్రీశైలం 195కిలోమీటర్, 
  • మార్కాపూర్ నుండి శ్రీశైలం, 57  కిలోమీటర్,
  • నంద్యాల నుండి  శ్రీశైలం,, 78   కిలోమీటర్,
  • సికింద్రాబాద్ నుండి శ్రీశైలం 233  కిలోమీటర్,

ఏదైనా ప్రధాన పట్టణం నుండి ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయానికి రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రెండు రాష్ట్రాల నుంచి రైలు సౌకర్యం   అందుబాటులో ఉంది. సమీప రైల్వే స్టేషన్లు: మార్కాపురం (85 కి.మీ), కర్నూలు (180 కి.మీ), నంద్యాల (190 కి.మీ)మార్కాపురం రైల్వే స్టేషన్ నుండి లేదా కర్నూల్ నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు.

విమాన మార్గం,  శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయానికి  విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ (232 కి.మీ)  కర్నూల్ ఎయిర్పోర్ట్,   నంద్యాల ఎయిర్పోర్ట్  విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుండి బస్సు లేదా ప్రైవేట్ టాక్సీ ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు.

శ్రీశైలం ఆలయ చిరునామా (Srisailam Temple Address)

  • దేవుడు, మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవి .
  • గ్రామము,  శ్రీశైలం
  • మండలం,  నంద్యాల
  • జిల్లా,  కర్నూల్, (518319)
  • రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్,
  • దేశం,  భారతదేశం,
  • కాంటాక్ట్ నెంబర్,  91-8333901351/2/3/4/5/6
  • 91-8524-287126

తరచుగా  అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  శ్రీశైలం  మల్లికార్జున స్వామి దేవాలయం  దర్శనం ఎప్పుడు.?
జవాబు, శ్రీశైలం మల్లికార్జున స్వామి   ఆలయంలో ఉదయం, 4:00 AM   నుండి ప్రారంభం.

2.  శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం   ఉత్తమ సమయంలో ఎప్పుడు.?
జవాబు, మల్లికార్జున స్వామి ఆలయానికి ఉత్తమ సమయం  మార్చు మరియు డిసెంబర్.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *