places to visit in Srisailam 2025 (శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు 2025)
places to visit in Srisailam 2025 శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు జ్యోతిర్లింగం అక్కడున్న అందమైన ప్రదేశాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.? శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా కాక పర్యటక క్షేత్రంగా కూడా నేటి కాలానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలో జ్యోతుర్లింగంలో ఒకటై న వంటి మల్లికార్జున స్వామి తో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన బ్రమరాంబ దేవి ఆలయం కూడా శ్రీశైలంలో దర్శనం చేసుకోవచ్చు. శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శించడానికి భక్తాదులు కొన్ని వేల సంఖ్యలో ప్రతినిత్యం వస్తూ ఉంటారు, వాళ్లు ఆధ్యాత్మిక అనుభూతిని ఎంతో ప్రీతిగా ఆహ్వానిస్తారు. ఈ పచ్చని అడవుల్లో ఎత్తైన కొండల్లో మల్లికార్జున స్వామి కొల్లవై ఉన్నారు.
(1).శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం, (2),శ్రీ హఠకేశ్వర స్వామి దేవాలయం,(3), శ్రీ అష్ట (4),కామేశ్వరి అమ్మవారి దేవాలయం, (5),అక్కమహాదేవి గుహలు, (6_పాలధార పంచదార, (7),శ్రీ శేకరేశ్వర స్వామి దేవాలయం, (8), పాతాళ గంగ స్నాన ఘట్టాలు,
పాతాళ గంగ స్నాన ఘట్టాలు శ్రీశైలం
మల్లికార్జున స్వామి భక్తాదులు ముందుగా పాతాళ గంగలో స్నానం చేయడం. కోసం విఠలాంబ నిర్మించిన మెట్టు పునరుద్దించి స్నానం గొట్టాలను నిర్మించడం జరిగింది.
విఠలాంబ నిర్మించిన మెట్లు మీద నుండి పవిత్రమైన పాతాళ గంగలో స్నానం ఆచరించి అక్కడ చెమ్ముతో నీళ్లు తీసుకువచ్చి మల్లికార్జున స్వామి అభిషేకం చేస్తారు. పాతాళ గంగ లో భక్తాదులు స్నానం ఆచరించిన తర్వాత సిరిసిల్ల స్వామి దర్శనానికి వెళ్తారు.
పాతాళ గంగలో వెళ్లిన భక్తాదులు ఒక రాగి సొమ్ము తీసుకొని పాతాళ గంగలో నీళ్లు తీసుకుపోయి. మల్లికార్జున స్వామిని అభిషేకం చేస్తారు.ఈ పాతాళ గంగను చేరుకోవడానికి రోడ్డు సదుపాయాలు కూడా అభివృద్ధి చెందింది. శ్రీశైలం లో ఈ మధ్యకాలంలో మల్లికార్జున శ్రీశైలం చాలా అభివృద్ధి పొందింది.
శ్రీ బయలు వీరభద్ర స్వామి శ్రీశైలం
శ్రీశైలం నుండి వీరభద్రుడు స్వామి దేవాలయం సందర్శించడానికి, సుమారు 101మీటర్ల దూరంలో ఆగ్నేయంలో శ్రీ బయలు వీరభద్రుడు స్వామి దేవాలయం ఉంటుంది. శ్రీశైలం సందర్శించడానికి వచ్చిన భక్తాదులు శ్రీ బయలు వీరభద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెళతారు. ఈ స్వామివారిని కుందరు కాపలా వీరభద్రుడు అని కూడా అంటారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి మహక్షేత్రానికి క్షేత్రపాలుకుడైన ఈ బయలు వీరభద్రుడు ఎండ వానలకు లెక్క లేకుండా కావాలా కాపలా కాస్తు ఉంటారు. అందువల్ల వీరభద్రుడు స్వామి ఉన్న మండపానికి పైకప్పు ఉండదు ఆలయం ముందు భాగంలో గంగాధర్ మండపం నుండి దక్షిణ వైపుకు గల రోడ్లో 100 మీటర్లు దూరంగా నడిస్తే ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. శ్రీశైలం మల్లికార్జున స్వామి కాపుల దారుడు శ్రీ బయలు వీరభద్ర స్వామి అని మనం చెప్పుకోవచ్చు ఆయన ప్రతినిత్యం కాపలా కాస్తూ ఉంటారు.
శ్రీ శివాజీ స్ఫూర్తి క్షేత్రం శ్రీశైలం
శ్రీశైలంలో చత్రపతి శివాజీ శ్రీశైలం మహా క్షేత్రానికి సందర్శించి స్వామివారిని సేవించి కొంతకాలం అక్కడే నివసించేవారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఉత్తరాన శివాజీ గోపురానికి ఎదురుగా అన్ని శివాజీ నివసించే భవనం ఉంటుంది. శివాజీ పాలకులు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించడం జరిగింది. అక్కడ శివాజీ కొంతకాలం జీవించి ఎంతో క్షేత్రానికి వెన్నెముకగా నిలిచారు. 50 ఏలుకు పూర్వం వరకు ఒక కట్టడం శిధిలావస్థలో ఉండేది.
దీనిని స్థానికులు శివాజీ ధ్యానం మందిరం అనేవారు. అప్పట్లో నిర్మించిన మందిరం శిథిలమైంది. ఇప్పుడు ఈ మందిరానికి పక్కనే ప్రస్తుతం శివాజీ మండపం ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శించిన భక్తాదులకు శివాజీ స్ఫూర్తి క్షేత్రం సందర్శించుకున్న తర్వాత ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. ప్రదేశానికి వచ్చి భక్తాదులు సందర్శించుకుని వెళ్తారు.
శ్రీ సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం
శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయానికి ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శించిన భక్తాదులు ముందుగా సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతే శ్రీశైలం మల్లికార్జున స్వామిని సందర్శించడం జరుగుతుంది. భక్తాదులు శ్రీశైలం క్షేత్రానికి సందడిసిచ్చినట్లు కైలాసంలో సాక్ష్యం చెబుతారు.
కనుక సాక్షి గణపతి స్వామి అంటారు. సాక్షి గణపతి స్వామిని సేవించి తన గోత్రనామాలను చెప్పుకుంటారు. స్వామి వారి విగ్రహం భక్తులకు పేర్లను నమోదు చేస్తున్నట్లు ఉంటుంది. నల్లని రాతితో మలచబడిన స్వామి వారి విగ్రహం భక్తుల హృదయాలు ఇట్లే ఆకర్షిస్తుంది. సాక్షి గణపతి ఆశీర్వరూపంలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తుంది. సాక్షి గణపతి శ్రీశైలం యాత్రకు మొదటి సాక్షి భక్తులు శ్రీశైలం మహా క్షేత్రాన్ని దర్శిస్తారు.
పాలధార పంచదార శ్రీశైలం
శ్రీశైలంలో శ్రీ సాక్షి గణపతి ఆలయా నికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పవిత్రమైన కొండల మధ్యలో జలపాతాలలో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. ఆధ్యాత్మిక నామకు చక్కని వంటి ఆదిశంకర చార్యులు తపస్సు చేశారని ఇక్కడ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో శివనంద లహరి గ్రంధాన్ని రాశారని నిపుణులు చెబుతారు. పాలధార పంచదార ప్రదేశంలో ఆదిశంకర చార్యులు గృహ కూడా ఇక్కడ ఉంది. పీఠాధిపతులు ఇక్కడ ఆదిశంకర చార్యులు తపస్సు చేసినట్టు ప్రదేశానికి యోగ దృష్టితో చెప్పడం, వల్ల ఆ ప్రదేశంలో వారు శంకరాచార్యులు పాలరాయితో విగ్రహాన్ని ప్రతిష్టించారు. పాలధార పంచదార ప్రాంతంలో ఈ ప్రదేశంలో దిగడానికి మెట్లు 147 ఉన్నాయి.
మెట్లు దిగి జరగబోయే ఒక చోట నుండి ఒక నీటి ధార పక్కనే ఐదు నీటి దారాలు ఉన్నాయి. మొదటిది శివుని పాల భాగం నుండి ఉద్భవించినట్టు చెబుతారు. మిగిలిన 5 దారాలు శివుని యొక్క పంచముఖాల నుండి ఉద్భవించినట్టు చెప్తారు. సంస్కృతంలో పాలము అంటే నుదురు మహాశివుని నుదుటి పై నుండి ఈ ధార ఉద్భవించింది కాబట్టి దీన్ని పాలధార అని అంటారు. పంచదార అంటే సంస్కృతంలో పంచము అంటే 5 అని అర్థం ఇక్కడ ఐదు దారులకు నీరు వస్తాయి కాబట్టి దీన్ని పంచదార అని అంటారు.
ఈ ప్రాంతంలో పాలధార తెల్లగాను పంచదార తియ్యగా ఉండడంతో ఈ ప్రాంతానికి పాలధార పంచదార అని పేరు వచ్చింది. ఈ పాలధార పంచదార నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ నీరు ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు ఎక్కడినుంచి వస్తాయో అది కూడా ఎవరికీ తెలియదు. 365 రోజులు నిరంతరం పాలధార పంచదార నీరు వస్తూనే ఉంటాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శించిన భక్తాదులు దట్టమైన అడవిలో అందమైన వాతావరణం సందర్శించుకున్న తర్వాత భక్తాదులు వెళతారు. ఇక్కడకు వచ్చిన భక్తాదులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది.
అక్క మహాదేవ గుహలు శ్రీశైలం
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి సందర్శించిన భక్తాదులు చుక్కల పర్వతానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో వాయువ్యూ దిశగా అక్క మహాదేవ గుహలు ఉన్నాయి. ఈ గుహలు మొత్తం ఆరు గుహలు ఉన్నాయో మధ్యలో ఉన్న గుహ అక్క మహాదేవుని నిర్మించినట్టుగా గుహ చెప్తారు. 12వ శతాబ్దానికి చెందిన శివశరణలలో అక్క మహాదేవి కొంతకాలం ఇక్కడ నివసించి ఈ గుహలో సహజ శివలింగానికి పూజించింది. ఈ గుహను చేరుకోవడానికి మెట్లు ద్వారా పాతాళగావుకు వెళ్లి ఇక్కడి నుండి పడవలో పది కిలోమీటర్ పైగా కృష్ణ నదిలో ప్రవేశిస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాము.
ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీశైలం ఆలయానికి తూర్పు దిశగా ఇష్టకామేశ్వర ఆలయం ఉంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి పెరుగన్నం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇది ఒక ఆచరంగా చెప్పుకోవచ్చు.
గమనిక, భక్తాదులు ఈ ప్రాంతంలో సందర్శించడానికి ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాగు వాటర్ బాటిల్ కంపల్సరిగా తీసుకుని వెళ్లాలి. అక్కడ కొండల్లో పోతున్న మీరు జాగ్రత్త పోవాలి. అక్కడ ఎక్కువగా పులులు తిరుగుతూ ఉంటాయి.ఆ ప్రదేశానికి మీరు సందర్శించడానికి వెళ్తున్నారంటే మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. బ్యాగు మరియు మీతో ఉన్న డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. దొంగలు ఉంటారు.