బతుకమ్మ పండుగ (Bathukamma festival 2024)
పరిచయం, బతుకమ్మ పండుగను మన భారతదేశంలో హిందూ సంప్రదాయ ప్రకారం, తెలంగాణ ఆడబిడ్డలు ఈ పండగను రంగ రంగ వైభోగంగా Bathukamma festival 2024 జరుపుకుంటారు. తెలుగులో బతుకమ్మ అంటే జీవితంలోకి తిరిగి రా అని అర్థం, బతుకమ్మలో బతుకు అంటే జీవించడం, లేదా బ్రతికించడం, అమ్మ అంటే తల్లి లేదా దేవత, బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు పాటు జరుపుకుంటారు. బొడ్డమ్మ పండుగ తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ తొమ్మిది రోజులు వివిధ పుష్ప పూలతో అమ్మర్చి గౌరీదేవిని బతుకమ్మ రూపంలో పూజిస్తుంటారు. అశ్వయూజ అష్టమి తిధి రోజు ఇంత వాళ్ళు చిరు రోజుగా జరుపుకుంటారు. ఆ రోజునే దసరా పండుగలో దుర్గాష్టమి అని కూడా అంటారు. అసలు బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారంటే తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు గౌరీ దేవిని బతుకమ్మ రూపంలో మంచిగా అలంకరించి పూజిస్తూ ఉంటారు.
తొమ్మిది రోజులు మహిళలు కొత్త దుస్తులు వేసుకొని రోజు స్నానం చేసి, బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి సందడి చేస్తారు.
బతుకమ్మ పండుగ ప్రారంభం మరియు ముగింపు సమయాలు
2024లో బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చిందంటే:2 అక్టోబర్ 2024 బుధవారం నాడు మహాలయ అమావాస్య తిధి తోటి ప్రారంభమై 10 (October) 2024 గురువారం దసరా పండుగ దుర్గాష్టమి రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగిస్తుంది.
బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు పూజిస్తారు. ఒక్కరోజున ఒక్కో పేరుతో బతుకమ్మను పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాలతో బతుకమ్మని పూజిస్తారు బతుకమ్మ పండుగ 2024 (October) 2 బుధవారం నాడున, భద్రపద బహుళ అమావాస్య భాద్రపద ముహూర్తం వచ్చింది.
9 రోజులు బతుకమ్మ పండుగ తేదీలు (9 days Bathukamma festival dates)
- బతుకమ్మకు మొదటి రోజు పేరు, మొదటి రోజు ఆ రోజున బతుకమ్మకు పేరు ఎంగిలి బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అనే పేరుతో మొదటి రోజు పిలుస్తారు.ఈరోజున వాళ్ళ పూర్వీకులకి వాళ్ళ ఇంట్లో వాళ్లకి అందరికీ అన్నదానం చేసి ఆ తర్వాత బతుకమ్మని అలంకరించి, బతుకమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు.
- బతుకమ్మకు మొదటి రోజు నైవేద్యాలు, బియ్యం నువ్వులు వీటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
- బతుకమ్మ పండుగ రెండవ రోజు, అశ్వ యుజ శుక్ల పాడ్యమి 3 (October) 2024 బతుకమ్మను రెండో రోజు ఈ పేరుతో పిలుస్తారు అంటే: అటుకుల బతుకమ్మ ఆ పేరుతో రెండో రోజు బతుకమ్మను పూజిస్తారు
- బతుకమ్మకు రెండవ రోజు నైవేద్యాలు, అటుకులు బియ్యం బెల్లం వీటిని రెండవ రోజు నైవేద్యాలుగా బతుకమ్మకు సమర్పిస్తారు.
- బతుకమ్మ పండుగ మూడవ రోజు, అశ్వ యుజ శుక్ల విదియా! 4 (October) 2024 అది మూడవ రోజు బతుకమ్మకు మూడవరోజు పేరు:, ముద్ద బతుకమ్మ ముద్దపప్పు లేదా ముద్దపువ్వు అనే పేరుతో మూడవరోజు బతుకమ్మను పిలుస్తారు
- బతుకమ్మకు మూడవరోజు నైవేద్యాలు, బతుకమ్మకు ముద్దపప్పు అన్నం నైవేద్యంగా స్వీకరిస్తారు
- బతుకమ్మ పండుగ నాలుగువ రోజు, అశ్వ యుజ శుక్ల తదియ 5 October) 2024 శనివారం బతుకమ్మకు నాలుగవ రోజు ఏం పేరుతో పిలుస్తారు అంటే, బతుకమ్మ నానబియ్యం అనే పేరుతో నాలుగవ రోజు పిలుస్తారూ.
- బతుకమ్మకు నాలుగవ రోజు నైవేద్యాలు, నానబెట్టిన బియ్యం బెల్లం నైవేద్యాలుగా సమర్పిస్తారు.
- బతుకమ్మ పండుగ ఐదవ రోజు, అశ్వ యుజ శుక్ల చవితి ఆదివారం అక్టోబర్ 6వ తారీకు 2024 బతుకమ్మను ఐదవరోజు ఏం పేరుతో పిలుస్తారు. అంటే: అట్ల బతుకమ్మ అనే పేరుతో 5వ రోజు పిలుస్తారు.
- బతుకమ్మకు ఐదవ రోజు నైవేద్యాలు, అట్లతో ఆరోజు పాయసం చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
- బతుకమ్మ పండుగ 6 రోజు, అశ్వ యుజ శుక్ల పంచమి సోమవారం నాడు నా అక్టోబర్, 7, 2024, బతుకమ్మను 6వ రోజు ఏ పేరుతో పిలుస్తారు. అంటే, ఆరోజున అర్రము బతుకమ్మ లేదా అలక బతుకమ్మ అని పేరుతో ఆరవ రోజు పిలుస్తారు.
- బతుకమ్మకు 6వ రోజు నైవేద్యాలు, ఆరవ రోజు నైవేద్యం లేదు. ఎందుకంటే గౌరీదేవి ఆరోజు బాధపడిందని తెలుసు కదా అందుకే ఆరవ రోజు నైవేద్యం లేదు.?
- బతుకమ్మ పండుగ ఏడవ రోజు, అశ్వ యుజ శుక్ల పంచమి షష్టి మంగళవారం అక్టోబర్, 8, 2024, బతుకమ్మను ఏడవ రోజు ఏ పేరుతో పిలుస్తారు. అంటే, వేపకాయల బతుకమ్మ అనే పేరుతో ఏడవ రోజు పిలుస్తారు.దుర్గా షష్టి గా జరుపుకుంటారు.
- బతుకమ్మకు ఏడవ రోజు నైవేద్యాలు, నైవేద్యంలో వేపకాయ వేసి నైవేద్యం చేస్తారు. ఆ రోజు అందుకే వేపకాయల బతుకమ్మ అనే పేరు ఏడవ రోజు వచ్చింది.
- బతుకమ్మ పండుగ 8వ రోజు, అశ్వ యుజ శుక్ల సప్తమి బుధవారం రోజున అక్టోబర్, 9 వ 2024, తారీకు వచ్చింది. బతుకమ్మకు ఎనిమిదవ రోజున ఏ పేరుతో పిలుస్తారు, అంటే, ఈ రోజున ముద్ద బతుకమ్మ అనే పేరుతో బతుకమ్మను పిలుస్తారు.
- బతుకమ్మకు ఎనిమిదవ రోజు నైవేద్యాలు, నువ్వులు బెల్లం నెయ్యి వెన్న కలిపి లడ్డుతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.
- బతుకమ్మ పండుగ తొమ్మిదవ రోజు, అశ్వ యుజ శుక్ల అష్టమి గురువారం అక్టోబర్, 10, 2024, న వచ్చింది. బతుకమ్మ ను 9వ రోజు ఏ పేరుతో పిలుస్తారు అంటే, ఈ రోజున బతుకమ్మకు పేరు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అనే పేరుతో రోజు బతుకమ్మను పిలుస్తారు.
- బతుకమ్మకు 9వ రోజు నైవేద్యాలు, ఈ రోజున 5 రకాలుగా నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఒక రకం స్వీట్ గా సమర్పిస్తారు. రెండవ రకం పులిహోరగా సమర్పిస్తారు. మూడవ రకం పెరుగన్నం సమర్పిస్తారు. సద్ది నిమ్మకాయ సమర్పిస్తారు ఐదో రకం చింతపండు పులిహోర సమర్పిస్తారు.