Dussehra Devi Navratri 2024 (దసరా దేవి నవరాత్రులు 2024)

By TempleInsider

Published On:

Dussehra Devi Navratri 2024

Join WhatsApp

Join Now
Dussehra Devi Navratri 2024 Pooja Timings Vijayadashami10 day Full Information In Telugu

దసరా దేవి నవరాత్రులు (Devi Navratri 2024)

2024లో దేవి నవరాత్రులు “ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి” నుండి ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులు అత్యంత పవిత్రమైన కాలం.  Dussehra Devi Navratri 2024  తేదీలు ఈ కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.

దసరా శరన్నవరత్రాలు  ప్రారంభం మరియు ముగింపు సమయాలు

శ్రీ కోద్రి  నామ సంవత్సరం  దక్షిణాయనం  శరత్రుతూ  ఆశ్వయుజ మాసం  శుక్లపక్షం 3,అక్టోబర్, 2024,  గురువారం నుండి ప్రారంభమై 12, అక్టోబర్, 2024, శనివారంతో  దసరా నవరాత్రులు  అలాగే విజయదశమి  అన్నీ కూడా  ముగుస్తాయి. 

విజయవాడ  కనకదుర్గ అమ్మవారి అలంకారాలు  నైవేద్యాలు తో పాటు శ్రీశైలం  భ్రమరాంబిక దేవి  నవదుర్గల  అలంకారాలు నైవేద్యాలు  అన్నీ కూడా తెలుపుతున్నాను  శరన్నవరాత్రుల్లో  మనకి మొదటి రోజు  అన్ని చెబుతున్నాము.


దసరా దేవి నవరాత్రులు  పది రోజులు పూర్తి వివరాలు (Dussehra Devi Navratri 10th days full details

దసరా దేవి  శరన్నవరాత్రులు మొదటి రోజు, 

పాడ్యమి  తిధి  2-(October)- 2024  బుధవారం రాత్రి, 10:45 pm  నిమిషాల నుండి 03-(October) 2024 గురువారం రాత్రి, 12:48 AM   నిమిషాల   వరకు పాడ్యమి  తిధి ఉంటుంది.

ఈ దినమున  విజయవాడ ఇంద్రకీలాద్రి  పై అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా  అలంకరిస్తారు, అలాగే  శ్రీశైలంలో అమ్మవారిని  సైలపుత్రి  దేవిగా  అలంకరిస్తారు. 

  • పూజా తేదీ, 2024 వ సంవత్సరంలో శరన్నవరాత్రులలో  మొదటి రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ, 3 (October) 2024 గురువారం రోజున  ఈరోజు నక్షత్రం  హస్త  మధ్యాహ్నం, 02;56 PM  వరకు ఉంటుంది తదుపరి చిత్త కలశం ఉన్నవాళ్లు అఖండ దీపం  పెట్టుకునేవాళ్ళు ఈరోజు  స్థాపించుకొని నవరాత్రుల పూజ ప్రారంభించాలి.
  • శుభ సమయం ఉదయం, 05:06 AM నుండి  ఉదయం, 09:48 AM నిమిషాల వరకు మీరు కలశ  స్థాపన మరియు అఖండ దీపం  నవరాత్రి పూజలు ప్రారంభించుకోవచ్చు,ఈ సమయంలో కుదిరిన వాళ్లకు ఉదయం,10:36 AM  నిమిషాల నుండి 12:00 PM  గంటలలోపు మీరు పూజలు చేసుకోవాలి. సాయంత్రం  పూజా విధానం, 04:59 PM  నిమిషాల నుండి  సాయంత్రం, 06:35 PM నిమిషాలు  వరకు  పూజను చేసుకోవచ్చు. 
  • నైవేద్యం, ఈరోజు  శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి , బెల్లం పరమాణు, నిమ్మకాయ పులిహోర,  పెసరపప్పు పాయసం,  నివేదా చేయాలి.శైలపుత్రి  అమ్మవారికి నైవేద్యం,  “కట్టు పొంగలని”  నీవేద్దం చేయాలి,
  • రంగు, ఎర్ర రంగు గులాబీ చీర  సమాపించుకోవాలి.
  • పువ్వులు,  ఎర్రటి గులాబీలు  మరియు  రెండు పూలు తోటి  అర్చించాలి.
  • అమ్మవారు  అష్ట స్తోత్రం,  లలిత త్రిశతి సూత్రం, లలిత అష్టోత్తరం, లలిత సహస్రనామ లు  చదువుకోవాలి. మూల మంత్ర మరియు శ్లోకాన్ని జపించుకోవాలి.
  • చేయవలసిన దానం,  ఈ రోజున మీరు చేయవలసిన దానం,  రవి కల గుడ్డతో  తాంబూలంలో పెట్టి ఎవరికైనా ముత్తైదులకు  లేదా పేదవారికి దానం చేయాలి.అలా చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. శత్రువుల  బాధ నుండి విముక్తి ఇవ్వగలరు. అష్ట సౌభాగ్యాలతో కలిగి ఉంటారు.

దసరా దేవి శరన్ననవరాత్రులు రెండవ రోజు,  

నవరాత్రుల్లో రెండవ రోజు ఆశయజా సిద్ధ విద్య తేదీ ప్రారంభం శుద్ధ విదియ 03-(October) 2024   గురువారం రాత్రి 12:49 pm   నిమిషాల నుండి 04-(October) 2024 శుక్రవారం రాత్రి, 02:51 pm   నిమిషాల వరకు     విదియ  తిధి ఉంటుంది. 

 ఈ రోజున కనక దుర్గమ్మ అమ్మవారు  శ్రీ గాయత్రి దేవి గారు  మరియు శ్రీశైలం భ్రమరాంబిక  దేవి బ్రహ్మచారిగా రూపంలో దర్శనం ఇస్తారు.  

  • పూజ తేదీ, శరన్నవరాత్రులు  నంద్యాల రోజు పూజలు నిర్వహించుకునే వారు తేదీ, 04(October) 2024 ,  శుక్రవారం రోజున ఈరోజు నక్షత్రం  “చిత్త”  పూజ సమయం సాయంత్రం, 05:32 pm  నిమిషాల వరకు ఉంటుంది.  తదుపరి స్వాతి ఈరోజున పూజ నిర్వహించుకోవడానికి మంచిగా ఉంటుంది.
  • శుభ సమయాలు,  ఉదయం, 05:06 AM   నిమిషాల నుండి ఉదయం, 08:15 AM   నిమిషాల  లోపు  పూజలు చేసుకోవాలి.  ఈ సమయంలో కుదిరిని వాళ్లు  ఉదయం, 09″03 AM   నిమిషాల నుండి ఉదయం, 10:30 AM  చేసుకోవాలి.   మరియు సాయంత్రం పూజ వివరాలు  సమయము, 04:59 PM   నిమిషాలు నుండి  సాయంత్రం, 06:35 PM  నిమిషాలలోపు పూజను చూసుకోవాలి. 
  • గాయత్రి  దేవికి  నైవేద్యాలు,  అల్లపు గారెలు  మాల శనగలతో చేసిన  గుగ్గిళ్ళు  దద్దోజనాన్ని ఈరోజు అమ్మవారికి నివేదించాలి. బ్రహ్మచారిని  దేవికి నైవేద్యాలు., ఈ దేవికి  పులిహోర  నివేదించాలి
  • రంగు, ఈరోజు  అమ్మవారికి  ఆరెంజ్ కు  కలర్ చీరని  అమ్మవారికి  సమర్పించాలి.
  • పువ్వులు, ఈరోజున అమ్మవారిని తామర పువ్వులతోటి  లేదా కల్వపువల తోటి ఆచరించాలి.
  • అమ్మవారు  అష్ట స్తోత్రం, ఈ రోజున అమ్మవారిని  గాయత్రి స్తోత్రం  లేదా గాయత్రి అష్టోత్రం పఠించాలి.
  • చేయవలసిన దానం, ఈ రోజున ఎర్రటి గాజులు ముత్తైదువులకి దానం ఇవ్వడం  ఆచారం ఈ రోజున  గాయత్రీ దేవిని పూజించడం, వలన  ఇంట్లో ఏవైనా మానసిక అనారోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా  తొలగిపోయి.  అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.

దసరా దేవి శరన్ననవరాత్రులు మూడవ రోజు, 

నవరాత్రుల్లో మూడవ రోజు ఆశ్వయుజ  శుద్ధ  పద్ది ఈ విధి ప్రారంభం  4 ,అక్టోబర్ ,2024  శుక్రవారం రాత్రి 2:52 AM నిమిషాల నుంచి 5  అక్టోబర్  2024  శనివారం రాత్రి తెల్లవారుజామున 4:39 AM  నిమిషాల వరకు  తదియ  తిధి  ఉన్నది.

మూడవరోజు  విజయవాడలో  శ్రీ అన్నపూర్ణాదేవిని అలంకారంలో అలాగే  శ్రీశైలంలో  అమ్మవారిని కూడా  అలంకారంలో చంద్రఘంటా రుపంలోనే   పూజిస్తారు.

  • పూజతేదీ, దసరా  నవరాత్రి మూడవరోజు  పూజను  నిర్వహించుకోవాల్సిన, తేదీ  5, అక్టోబర్, 2024,  శనివారం  ఈ రోజున  నక్షత్రం స్వాతి రాత్రి 8:00 PM  గంటల వరకు ఉన్నది.  
  • శుభ సమయం, ఈ రోజున పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయం ఉదయం, 7:30 AM  నిమిషాల  నుండి  ఉదయం 9:00 AM  గంటల లోపు ఈ సమయం  కుదరని వాళ్లు  ఉదయం 10:31 AM  నిమిషాల నుండి 12:00 PM  గంటల లోపు నిర్వహించుకోవచ్చు , సాయంత్రం  పూజను నిర్వహించుకునే వాళ్లు 4:59 PM  నిమిషాల నుండి  సాయంత్రం, 6:35 PM  నిమిషాల లోపు  పూజను  ప్రారంభించుకోవచ్చు,
  • మూడవరోజు అన్నపూర్ణ దేవికి నైవేద్యాలు, దద్దోజనం  కట్టు పొంగలిని  ఈరోజు అమ్మవారికి నివేదన చేయాలి. మూడవరోజు  చంద్రగంటి అమ్మవారికి నైవేద్యాలు. కొబ్బరి అన్నాన్ని  చంద్రగంటి అమ్మవారికి నివేదన చేయాలి.
  • రంగు, ఈ రోజున అమ్మవారికి  ఏ చీరని సమర్పించాలంటే  గంధం రంగు  లేదా  పసుపు రంగు చీరని అమ్మవారికి  సమర్పించాలి.
  • పువ్వులు, ఈరోజు అమ్మవారిని  మల్లెపూలతో కానీ  పోవడ పూలతో కానీ   అమ్మవారికి అర్జించాలి.
  • అమ్మవారు  అష్ట స్తోత్రం, ఈ రోజున అన్నపూర్ణ స్తోత్రం లేదా  అన్నపూర్ణ మంత్రాన్ని జపించడం మంచిది.  మూలమంతాల శ్లోకాన్ని కూడా ఈరోజు చదువుకోవాలి మీరు.
  • చేయవలసిన దానం, ఈరోజు  మీరు అన్నదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది.

దసరా దేవి శరన్ననవరాత్రులు నాలుగవ రోజు,

ఆశ్వయుజ  శబ్ద  శుద్ధ  చవితి  తిధి  ప్రారంభం  6  అక్టోబర్  2024 ఆదివారం  తెల్లవారుజామున 4:40 AM  నిమిషాల నుంచి 7 అక్టోబర్ 2024  సోమవారం ఉదయం 6:01 AM  నిమిషం వరకు చవితి తిది ఉన్నది.

ఈరోజున విజయవాడ కనకదుర్గమ్మని  వారిని  శ్రీ లలిత త్రిపుర  సుందరి దేవిగా  పూజిస్తారు  శ్రీశైలంలో  అమ్మవారిని  కోష్మాండా దేవి రూపంలో  అలంకరిస్తారు 

  • తేదీ శరన్ననవరాత్రులు  నాలుగవ రోజు  చేసుకోవాల్సిన తేదీ, 6 అక్టోబర్ 2024 ఆదివారం  రోజున  ఈ రోజున నక్షత్రం విశాఖ  రాత్రి 9:55 PM నిమిషాల వరకు ఉన్నది.
  • శుభ సమయం,ఈ రోజున  పూజ నిర్వహించుకోవడానికి ఉదయం 5:06 AM   నిమిషాల నుండి మధ్యాహ్నం 12:35 PM  నిమిషాల వరకు అంతా శుభసమయమే,  ఈ సమయంలో మీరు పూజ చేసుకోవచ్చు,  ఇక సాయంత్రం  పూజను నిర్వహించుకునే సమయం 6:00 PM   తర్వాత  మీరు  పూజను  ప్రారంభించుకోవచ్చు.
  • ఈ రోజున లలితా అమ్మవారికి నైవేద్యాలు,దద్దోజనం బెల్లం పరమాన్నం పెసర బూరెలను నివేదన చేయాలి. అమ్మవారికి ఈరోజు కూష్మాండా దేవికి  ఈ రోజు నైవేద్యాలు,చిల్లు  లేదా అల్లపు గారాలను నివేదించాలి.
  • రంగు , ఈ రోజున అమ్మవారికి  ఏ రంగు చీరని సమర్పించాలంటే,బంగారు రంగు చీరని అమ్మవారికి  ఈరోజు సమర్పించాలి,
  • పువ్వులు,ఈరోజు అమ్మవారిని ఎర్రటి గులాబీ తోటి లేదా ఎర్రటి  కల్వ పువ్వులతోటి   అర్ర్చించాలి. 
  • అమ్మవారు  అష్ట స్తోత్రం, అమ్మవారి  అష్టోత్తరాలు లేదా అమ్మవారి  లలిత  స్తోత్రాలు  చదవడం  లేదా వినడం చేయడం చాలా మంచిది.
  • చేయవలసిన దానం, ఈ రోజు అమ్మవారికి  నిషిద్ధ ఆహారం  ఉసిరి అలాగే మీ యధాశక్తి   కొలది. మీరు అమ్మవారి లలిత సహస్రనామ, పుస్తకాలను ఎంతమందికి  పంచగలిగితే అంత మంచిది. 
  • కలిగే ఫలితాలు,ఈరోజు మనం  అమ్మవారిని పూజించడం వలన  మన ఇంట్లో  మనశ్శాంతి పెరిగి  అన్యోన్యత పెరిగి ఆనందంగా  ఇల్లు  చాలా చాలా  బాగుంటుంది.  ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. 

దసరా దేవి శరన్ననవరాత్రులు ఐదవ రోజు, 

ఆశ్వయుజ  శుద్ధ పంచమి  ప్రారంభం, 07-  అక్టోబర్, 2024, సోమవారం ఉదయం, 06:02 AM నిమిషాల  నుండి 8, అక్టోబర్, 2024,  మంగళవారం  ఉదయం, 06:54 AM   నిమిషాల వరకు పంచమా  తిధి  ఉంటుంది. 

అమ్మవారిని ఈరోజు  విజయవాడలో కనకదుర్గమ్మ  వారిని  శ్రీ మహా చండి దేవి అలంకారులతో పూజిస్తారు. మరియు శ్రీశైలంలో  సందమాతగా  పూజిస్తారు.

  • పూజ సమయాలు రోజు, 07- అక్టోబర్ -2024, సోమవారం రోజున  ఈ రోజు నక్షత్రం  అనురాధ  ఆరోజు రాత్రి, 11:40 PM  నిమిషాల వరకు  ఉంటుంది. 
  • శుభ సమయం, సోమవారం ఉదయం, 05:55 AM  నిమిషాల నుండి  ఉదయం, 07:30 AM   నిమిషాలలోపు  పూజలు చేసుకోవచ్చు, లేనిచో  సమయం  కుదురాన  వారుకు, 09:01 AM  నిమిషాల నుండి 12:00 PM  గంటలు లోపు  పూజను జరుపుకోవాలి.సాయంత్రం పూజ సమయం, 05:49 PM  నిమిషాల నుండి  సాయంత్రం, 06:35 PM   నిమిషాల లోపు పూజలు చేసుకోవాలి. 
  • అమ్మవారికి నైవేద్యం, పులిహోర, బెల్లం,  పరమాన్నం,   వడపప్పు,  చలివిడి,    సమర్పించుకోవాలి.  స్కంద దేవికి  దద్దోజనం సమర్పించుకోవాలి.
  • ఎరుపు చీర, పసుపు లేదా బంగారు  వర్ణం గల చీరలు  సమర్పించుకోవాలి.
  • పువ్వులు, అమ్మవారికి ఈ రోజున  పసుపు రంగు,  పువ్వులు పూజలు చేసుకోవాలి.
  • అమ్మవారి స్తోత్రం,  శ్రీ మహా చండీ స్తోత్రం  శ్రీ మంగళ చండి స్తోత్రం  అష్టోత్తరం  చదువుకోవాలి.  మూల మంత్రం కూడా జపించుకోవాలి.
  • చేయవలసిన దానం, ఈ రోజున సబ్ బ్రాహ్మణులకు  స్వయంపాకం లేదా దక్షిణంతో  తాంబూలం  దానం చేస్తే మంచిది.

దసరా దేవి శరన్ననవరాత్రులు ఆరవ రోజు

రోజు, ఆశ్వయుజ  శుద్ధ షష్టి  తిధి ప్రారంభం, 08- అక్టోబర్ -2024  మంగళవారం ఉదయం, 06:55 AM  నిమిషాల నుండి 09-  అక్టోబర్ – 2024 బుధవారం  ఉదయం, 07:20 AM   నిమిషాల వరకు షష్టి తిథి ఉంటుంది.

అమ్మవారిని విజయవాడలో  మహాలక్ష్మి దేవిగా పూజిస్తారు.   అలాగే శ్రీశైలంలో  అమ్మవారిని  కాత్యాయని రూపంలో పూజిస్తారు.

  • పూజ  తారీకు, 08-  అక్టోబర్ – 2024 మంగళవారం ఈ రోజున నక్షత్రం జేష్ఠ  పూజ సమయం రాత్రి 12:55 AM  నిమిషాల వరకు ఉంటుంది.
  • పూజా సమయం, మంగళవారం ఉదయం, 07:16 AM  ఉదయం, 08:17 AM   నిమిషాలలో  పూజలు చేసుకోవచ్చు,  ఈ సమయం కుదిరిన వారు,   ఉదయం, 09:05 AM నిమిషాల నుండి  మధ్యాహ్న, 12:00 PM  గంటల్లోపు పూజలు చేసుకోవాలి. మరియు సాయంత్రం, 04:52 PM  నిమిషాల నుండి సాయంత్రం, 06:28 PM   నిమిషాలలోపు పూజను చూసుకోవాలి.
  • అమ్మవారి నైవేద్యం, పూర్ణాలు, క్షీరాణం,  పానకం,వడపప్పు,  సమర్పించుకోవాలి.   మరియు  కాత్యాయని అమ్మవారికి  కేసరితో చేసిన పదార్థము నైవేద్యంగా సమర్పించుకోవాలి.
  • రంగు చీర, అమ్మవారికి గులాబీ రంగు చీరలు సమర్పించుకోవాలి.
  • పువ్వులు, తెల్ల కలవ పువ్వులతోటి  మరియు సంపెంగల పువ్వులతో  మరియు  సన్న జాజులతో  మరియు  తామర పూలతో  పూజలు చేసుకోవాలి. మీకు శుభాలు కలుగుతాయి.
  • అమ్మవారి స్తోత్రం, శ్రీ సూక్తం  లేదా మహాలక్ష్మి  స్తోత్రం పట్టించుకోవాలి.  మూలమంత్రం మరియు శ్లోకాలు జపించుకోవాలి.
  • చేయవలసిన దానం,  సబ్ బ్రాహ్మణులకు  దక్షిణ తాంబూలం  చేయాలి.   లేదా పేదవారికి  మీ యధాశక్తికి  కొలది దానం చేయండి.

దసరా దేవి శరన్ననవరాత్రులు ఏడవ రోజు

అశ్వయుజ శుద్ధ  సప్తమి తిధి ప్రారంభం, 9- అక్టోబర్ -2024 బుధవారం ఉదయం, 07:21 AM   నిమిషాల నుండి 10-  అక్టోబర్ -2024, గురువారం ఉదయం, 07:16 AM   నిమిషాల   వరకు  సప్తమ తిధి ఉంటుంది. 

ఈ రోజున విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని  శ్రీ సరస్వతి దేవిగా పూజిస్తారు. మరియు శ్రీశైలంలో  అమ్మవారిని  కాలరాత్రి దేవిగా పూజిస్తారు. 

  • పూజా తేదీ , 09- అక్టోబర్- 2024,   బుధవారం రోజున ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం  రాత్రి, 01:39 AM   నిమిషాల వరకు ఉంటుంది. 
  • శుభ సమయం,  బుధవారం ఉదయం, 05:06 AM   నిమిషాల నుండి ఉదయం, 09:10 AM నిమిషాల అశ్వయుజ శుద్ధ  సప్తమి తిధి ప్రారంభం, 9- అక్టోబర్ -2024 బుధవారం ఉదయం, 07:21 AM   నిమిషాల నుండి 10-  అక్టోబర్ -2024, గురువారం ఉదయం, 07:16 AM   నిమిషాల   వరకు  సప్తమ తిధి ఉంటుంది. 
  • అమ్మవారు నైవేద్యం, పాయసం, మరియు పెరుగన్నం,  దద్దోజనం  అన్నం, అమ్మవారికి సమర్పించుకోవాలి.  
  • రంగు చీర, తెలుపు వర్ణంలో  ఉన్నటువంటి  చీరలు అమ్మవారికి సమర్పించుకోవాలి.
  • పువ్వులు, అమ్మవారికి తెలుపు వారంలో ఉన్నటువంటి పువ్వులను  మారేడు దళాలతో  పూజించుకోవాలి.
  • అమ్మవారు స్తోత్రాలు, సరస్వతి ద్వాదశి నామాలు, సరస్వతి సంబంధించిన సూత్రాలు మరియు శ్లోకాలు మూల మంత్రాలు  పట్టించుకోవాలి.
  • చేయవలసిన దానం,  పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల  మీకు మంచి ఫలితాలు  కలుగుతాయి.

దసరా దేవి శరన్ననవరాత్రులు  8వ రోజు

అశ్వయుజ  శుద్ధ అష్టమి తిథి ప్రారంభం, 10 -అక్టోబర్- 2024,  గురువారం ఉదయం, 07:17 AM   నిమిషాలు నుండి 11- అక్టోబర్- 2024,   శుక్రవారం  ఉదయం, 06:41 AM   నిమిషాల వరకు  అష్టమి తిది ఉంటుంది.

ఈరోజు విజయవాడలో    కనక దుర్గ అమ్మవారిని  శ్రీ దుర్గాదేవి అలంకారాల్లో పూజిస్తారు.  మరియు శ్రీశైలంలో  మహా గౌర దేవి  గా పూజిస్తారు.

  • పూజ తేదీ, 10- అక్టోబర్- 2024,  గురువారం రోజున ఈ రోజు నక్షత్రం పూర్వాషాడ  ఈ రోజు రాత్రి, 01:47 AM  నిమిషాలు  వరకు ఉంటుంది.
  • శుభ సమయం, గురువారం ఉదయం, 05:06 AM  నిమిషాల నుండి  ఉదయం, 09:48 AM   నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు, ఈ సమయం కుదరని  వారు. ఉదయం, 10:36 AM   నిమిషాల నుండి  ఉదయం, 11:19 AM   నిమిషాలలో పూజలు చేసుకోవాలి. మరియు సాయంత్రం, 04:52 PM  నిమిషాల నుండి   సాయంత్రం 06:28 PM  నిమిషాలలో పూజలు చేసుకోవాలి.
  • అమ్మవారు నైవేద్యం, పులగం,  కదంబం,  పులిహోర, మరియు మహా గౌరదేవుని నైవేద్యం చక్కెర పొంగలి నీవే దేంగా  సమర్పించుకోవాలి.
  • రంగు చీర, అమ్మవారికి  ఎరుపు రంగులో చీర  పూజకు సమర్పించుకోవాలి.
  • పువ్వులు, అమ్మవారికి ఎరుపు వంటి పూలతో పూజలు చేసుకోవాలి.
  • అమ్మవారి స్తోత్రాలు,   దుర్గ సహస్రనామం  దుర్గ సోత్రం  దుర్గ  లలిత  సహస్రనామాలు  మరియు శ్లోకాలు మూలమంత్రాల పటించాలి.
  • చేయవలసిన దానం,  మీరు ముత్తైదులకు  ఎర్ర చీర మరియు  ఎర్రటి గాజులు  తాంబూలంలో  పెట్టి దానం చేస్తే మంచిది.

దసరా దేవి శరన్ననవరాత్రులు 9వ రోజు

అశ్వయుజ శుద్ధ నవమి తిది ప్రారంభం, 11-అక్టోబర్- 2024,  శుక్రవారం ఉదయం, 06:42 AM  నిమిషాల నుండి   తెల్లవారుజామున, 05:49 AM  నిమిషాల వరకు  నవమి తిధి ఉంటుంది. 

ఈ రోజున విజయవాడలో  కనకదుర్గమ్మ అమ్మవారిని  శ్రీ మహిషాసుర  మర్దిని అవతారంగా పూజిస్తారు.  మరియు శ్రీశైలంలో  అమ్మవారిని  సిద్ధ దాత్రి  దేవిక పూజిస్తారు.

  • పూజ తేదీ, 11-  అక్టోబర్- 2024,   శుక్రవారం రోజు  ఈ రోజు నక్షత్రం  ఉత్తరాషాడ  రాత్రి, 01:33 AM  నిమిషాల వరకు ఉంటుంది. 
  • శుభ సమయం, శుక్రవారం  రోజు ఉదయం, 05:06 AM   నిమిషాల నుండి  ఉదయం, 08:15 AM  నిమిషాలు లోపు పూజలు చేసుకోవాలి.ఈ సమయాన కుదురని వారు   ఉదయం, 09:03 AM నిమిషాలు నుండి   ఉదయం, 09:43 AM   నిమిషాలు  వరకు పూజలు చేసుకోవచ్చు.   మరియు సాయంత్రం, 04:52 PM   నిమిషాల నుండి సాయంత్రం, 06:28 PM  నిమిషాల లోపు పూజలు చేసుకోవాలి.
  • అమ్మవారి నైవేద్యం, చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడ పప్పులు,  అమ్మవారికి సమర్పించుకోవాలి.  సిద్ధరాత్రి అమ్మవారికి   పాయసం మరియు అన్నం సమర్పించుకోవాలి.
  • రంగు చీర,  కాఫీ రంగు కానీ  ముగ్గుపొడి రంగు చీరలు  అమ్మవారికి సమర్పించుకోవాలి.
  • పువ్వులు, నల్ల పూలు మరియు  వివిధ రకాల తో పుష్పాలతో ఈరోజు అమ్మవారు సమర్పించుకోవాలి.
  • అమ్మవారు స్తోత్రాలు,  చండీ సప్తశతి  ఖడ్గమాల  స్తోత్రాలను పాటించాలి.   మరియు మూలం మంత్రం మరియు శ్లోకాలు జపించుకోవాలి.
  • చేయవలసిన దానం,  సబ్ బ్రాహ్మణుడు  స్వయంపాకాన్ని  దానం చేయాలి.

దసరా దేవి శరన్ననవరాత్రులు 10వ రోజు

 అశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి   తిధి ప్రారంభం, 12- అక్టోబర్ -2024,  శనివారం  తెల్లవారుజామున, 05:50 AM  నిమిషాల నుండి 12-  అక్టోబర్- 2024  శనివారం  రాత్రి తెల్లవారుజామున, 04:21 AM  నిమిషాల వరకు ఉంటుంది.

ఈ రోజున విజయవాడలో  కనుక మహా దుర్గాదేవిని  శ్రీ రాజరాజేశ్వరి దేవిక పూజిస్తారు.  మరియు శ్రీశైలంలో  భ్రమరాంబ దేవిక  అమ్మవారు  నిజరూప దర్శనం ఈరోజున ఉంటుంది. అశ్వయుజ శుద్ధ దశమి  దీనినే విజయదశమి అంటాము.

  • పూజ తారీకు, 12- అక్టోబర్- 2024  శనివారం  ఈరోజు నక్షత్రం  శ్రావణ నక్షత్రం  రాత్రి, 12:51 AM   వరకు ఉంటుంది.
  • శుభ సమయం,   శనివారం  ఉదయం, 07:30 AM   నిమిషాల నుండి  ఉదయం, 09:00 AM   లోపు పూజను చేసుకోవాలి.  . ఈ సమయం కూతురిని వారు   ఉదయం, 10:31 AM  నిమిషాల నుండి 12:00 PM గంటల లోపు పూజను చేసుకోవాలి.
  • అమ్మవారు నైవేద్యం,  శాఖ    అన్నాన్ని నివేదించాలి.   మహనివేదం చేయాలి.
  • రంగు చీర,  అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర లు సమర్పించుకోవాలి,
  • పువ్వులు,  ఎర్రని పుష్పాలతోటి లేదా వివిధ పుష్పాలతోని  అమ్మవారిని సమర్పించుకోవాలి.
  • అమ్మవారు  స్తోత్రాలు,  సప్తసతి స్తోత్రం,  లలిత సహస్రనామం,  స్తోత్రాలను పాటించాలి,   మరియు మూలమంత్రం మరియు శ్లోకాలు జపించుకోవాలి.
  • చేయవలసిన దానం,   ఈ రోజున  పూలు మాల  ముత్తయిదులకు  దానం చేస్తే  మంచి ఫలితాలు పొందుతారు.

2024 నవరాత్రి తేదీలు, 

  • ప్రథమ పూజ (ప్రథమ నాడు) – అక్టోబర్ 3, 2024 (గురువారం)
  • ద్వితీయ పూజ – అక్టోబర్ 4, 2024 (శుక్రవారం)
  • తృతీయ పూజ– అక్టోబర్ 5, 2024 (శనివారం)
  • చతుర్థ పూజ – అక్టోబర్ 6, 2024 (ఆదివారం)
  • పంచమ పూజ – అక్టోబర్ 7, 2024 (సోమవారం)
  • షష్ట పూజ – అక్టోబర్ 8, 2024 (మంగళవారం)
  • సప్తమ పూజ – అక్టోబర్ 9, 2024 (బుధవారం)
  • అష్టమ పూజ (దుర్గాష్టమి)– అక్టోబర్ 10, 2024 (గురువారం)
  • నవమ పూజ (మహానవమి) – అక్టోబర్ 11, 2024 (శుక్రవారం)
  • విజయదశమి– అక్టోబర్ 12, 2024 (శనివారం)

ఈ రోజుల్లో ప్రతి ఒక్క రోజూ వివిధ రూపాలలో అమ్మవారి పూజ జరుగుతుంది.

నవరాత్రుల వివరాలు

  • ప్రథమా (ఘట్టం ప్రతిష్ఠ)తొలిరోజున దుర్గామాత ప్రతిష్ఠ నిర్వహించి, కలశం పెట్టడం ఆనవాయితీ.
  • ద్వితీయా నుండి నవమి వరకు,  ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు – శైలం, కాలరాత్రి, మహిషాసురమర్ధిని, సకంభరి వంటి రూపాలు.
  • సరస్వతీ పూజ,  ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో సారస్వతీ పూజ, ఆయుధ పూజ, విద్యారంభం చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి.
  • అమ్మవార్లకు ప్రీతికరమైన భక్తి కార్యక్రమాలు,  శక్తి పీఠాల్లో ఉత్సవాలు, అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.

 విజయదశమి ప్రత్యేకత

  • రావణ దహనం, విజయదశమి రోజున రావణ దహనం చేస్తారు, ఇది చెడుపై మంచి విజయం సాధించిన రాముడి కథతో సంబంధం కలిగి ఉంటుంది.
  • అలంకారమైన దుర్గామాత విగ్రహాలు, నవరాత్రుల ముగింపున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు.
  • అమ్మవారి నిమజ్జనం,  భారీ ఊరేగింపు తర్వాత అమ్మవారి విగ్రహాలను నదుల్లో లేదా సరస్సుల్లో నిమజ్జనం చేస్తారు.

ప్రముఖ స్థలాలు

  • అలంపూర్ దుర్గామాత ఆలయం (తెలంగాణ)– నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు.
  • కనకదుర్గ అమ్మవారి ఆలయం, విజయవాడ (ఆంధ్రప్రదేశ్) – అఖిల భారత స్థాయిలో ప్రసిద్ధి గాంచిన నవరాత్రి ఉత్సవాలు.
  • బద్రకాళి అమ్మవారి ఆలయం, వరంగల్– నవరాత్రులలో అత్యంత భక్తితో నిర్వహించే పూజలు.

సాంప్రదాయాలు

  • బతుకమ్మ పండుగ, దసరా సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఇది మహిళలు జరుపుకునే పువ్వుల పండుగ.
  • అయ్యంగారులు, పూజారులు, ఈ పండుగ సమయంలో శక్తి పీఠాల్లో పెద్దసంఖ్యలో అయ్యంగార్లు అమ్మవారిని పూజిస్తారు.


భక్తి గీతాలు, కళల ప్రదర్శనలు

బుర్ర కథలు, హరికథలు,  వీటి ద్వారా అమ్మవారి మహిమలు, రామాయణ, మహాభారతంలోని కథలు వినిపిస్తారు. బోనాల పండుగ,  ఈ కాలంలో బోనాలు కూడా నిర్వహించబడతాయి. సందడితో  దసరా రోజు చాలా ఘనంగా జరుపుకుంటారు.

దసరా సందర్భంగా పాటించే నియమాలు
  • వ్రతాలు, ఉపవాసం చేయడం, అమ్మవారిని పూజించడం.
  • ఆహార నియమాలు,  వ్రత సమయంలో పల్లీలు, పళ్లు, పాలు తీసుకోవడం.
  • మూలం,  ఈ సమాచారాన్ని అనేక ప్రాచీన గ్రంథాలు, ధార్మిక వేదికలపై ఆధారపడి సేకరించాను, కాబట్టి కాపీరైట్ లేకుండా ఉపయోగించవచ్చు.

   ధన్యవాదములు..!

Leave a Comment